ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు రూ.11.45 కోట్లు.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

ఇన్‌స్టాలో ఒక్క పోస్టు ద్వారా రూ.11.45 కోట్లు అర్జిస్తున్నాడని ఓ సంస్థ వెల్లడించింది. దీనిపై కోహ్లీ స్పందించాడు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 7:37 AM GMT
Virat Kohli,  social media, earnings report,

 ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు రూ.11.45 కోట్లు.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో భారీ సంఖ్యలో విరాట్‌ను ఫాలో అవుతుంటారు. ఈక్రమంలో విరాట్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు ద్వారా రూ.11.45 కోట్లు అర్జిస్తున్నాడని ఓ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. దాంతో.. విరాట్‌ కోహ్లీ స్పందించాడు.

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు ఆర్జిస్తాడనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒక్క పొస్టుతో ఎక్కువ డబ్బులు అర్జిస్తున్న టాప్‌ 25లో భారత్‌ నుంచి ఉన్న ఏకైక వ్యక్తి విరాట్‌ కోహ్లీనే అని ప్రచారం జరిగింది. ఈ వైరల్‌ వార్తపై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. తన జీవితంలో ఇప్పటి వరకు తాను అందుకున్న ప్రతి దానికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా.. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న సోషల్‌ మీడియా సంపాదన వార్త పూర్తిగా అవాస్తవమని విరాట్ ప్రకటించాడు. అందులో ఎలాంటి నిజం లేదంటూ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా విరాట్‌ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే విరాట్ ఖాతాను ఏకంగా 256 మిలియన్ల (25 కోట్లకు పైగా) మంది ఫాలో అవుతున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి డిమాండ్‌ చాలా ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడని సామాజిక మాధ్యమాల వ్యాపార నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌క్యూ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు విరాట్‌ కోహ్లీ రూ.11.45 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని నివేదికను. ఇక విరాట్‌ కోహ్లీ కంటే ముందు ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టాయానో రొనాల్డో, మెస్సీ ఉన్నారంటూ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ ఒక్క పోస్టుతో కొందరు టీమిండియా ఏడాది వార్షిక ఆదాయాన్ని పొందుతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టడంతో స్పందించి.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Next Story