విరాట్‌ కోహ్లీ ఒక్క ఇన్‌స్టా పోస్టుకి ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం చార్జ్‌ చేసే తొలి 20 మంది పేర్లను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 4:15 PM IST
Virat Kohli, One insta post,  11 crore rupees,

 విరాట్‌ కోహ్లీ ఒక్క ఇన్‌స్టా పోస్టుకి ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా..?

టీమిండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇతర టీముల్లోని ఆటగాళ్లు కూడా కోహ్లీ ఆట తీరుని ప్రశంసిస్తారు. ఇంతటి అభిమానాన్ని చూరగొన్న విరాట్‌కు సోషల్‌ మీడియాలోనూ ఫాలోవర్లు ఎక్కువే. భారత్‌లో అత్యంత ఖరీదైన ఇన్‌స్టా పోస్టులు విరాట్‌ కోహ్లీవే. అతను సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు ఆదాయం కంటే ఎక్కువ. ఇటీవల హెచ్‌క్యూ జాబితా ఈ వివరాలను తెలుపుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం చార్జ్‌ చేసే తొలి 20 మంది పేర్లను విడుదల చేశారు. అయితే.. వీరిలో విరాట్‌ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ సింగిల్‌ స్పాన్సర్డ్‌ పోస్టుకు రూ.11 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. ఇన్‌స్టాలో విరాట్‌ కోహ్లీకి 25.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే. కాగా.. 20 మంది జాబితాలో భారత్‌ నుంచి ఉన్న ఏకైక వ్యక్తి విరాట్‌ కోహ్లీనే. అత్యధికంగా చార్జ్‌ చేసే వారి జాబితాలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కూడా ఉంది. కానీ.. ఆమె 29వ స్థానం దక్కించుకుంది. ఆమె ఒక పోస్టుకు రూ.4.4 కోట్లు వసూలు చేస్తోంది. హూపర్‌ హెచ్‌క్యూ జాబితాలో ప్రముఖ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో మెస్సీ ఉన్నాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక్క పోస్టుకు రూ.26.7 కోట్లు తీసుకుంటుండగా.. 47.9 కోట్ల మంది ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్న మెస్సీ ఒక్క పోస్టుకు గాను రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.

ఇన్‌స్టా ద్వారా కోట్లు వసూలు చేస్తున్న వారి జాబితాపై స్పందించిన హూపర్‌ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు బాండర్.. వీరి సంపాదన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. గడిచిన ఏళ్లతో పోలిస్తే ఈ స్టార్ల సంపాదన పెరుగుతూనే ఉందని వెల్లడించారు. కొత్తగా సోషల్‌ మీడియాలో ఎంతమంది వచ్చినా..ఈ సెలబ్రిటీల ఆకర్షణ, గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదని వ్యాఖ్యానించారు. రొనాల్డో, మెస్సీ మైదానంలోనే కాదు.. డిజిటల్ వేదికలపైనా రాజ్యమేలుతున్నారని బాండర్ అన్నారు.

Next Story