మొహాలీలో మూడు రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం తరపున 100 టెస్టులు ఆడిన 12వ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో 8,000 పరుగులను మొదటి రోజు కోహ్లీ తన బ్యాటింగ్ లో అధిగమించాడు. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో టెస్టు కోసం బెంగళూరుకు వెళ్లనుంది. మొహాలీ టెస్టులో భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసినా, మైదానంలో కోహ్లి తన చేష్టలతో అలరించాడు.
క్రికెటర్లలో బాగా పాపులర్ అయిన ట్రెండ్‌లలో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప' ఒకటి. సినిమాలోని డైలాగుల నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి అంశం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం (మార్చి 7) అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ ను భారత స్టార్ కోహ్లి అనుకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన కోహ్లీ ఎడమచేతి వాటం స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ ఇన్నింగ్స్, 222 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేయడంతో కోహ్లీకి ఈ మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.