టీ10 టోర్నీలో సంచలనం, 2 ఓవర్లలో 62 పరుగులు
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది.
By Srikanth Gundamalla
టీ10 టోర్నీలో సంచలనం, 2 ఓవర్లలో 62 పరుగులు
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్బుత విజయాన్ని అందుకుంది. 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా 3 వికెట్లు కోల్పోయి 9.5 ఓవర్లలో చేధించింది. మ్యాచ్ చివరి రెండు ఓవర్లు చరిత్రను తిరగరాసాయి.
మొదట బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత పది ఓవర్లలో 168 పరుగుల భారీ స్కోరును సాధించింది. వికెట్ కీపర్ ఆర్యన్ మహ్మద్ (104*) సెంచరీ చేశడు. ఓపెనర్ ముహమ్మద్ మోయిజ్ చేసిన 42 పరుగులు సాధించాడు. ఆస్ట్రియా పది ఓవర్లలో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రియా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగలిగారు. చివరి రెండు ఓవర్లలో వారికి 61 పరుగులు చేయాల్సి ఉంది. ఇక అంతా ఆస్ట్రియాకు ఓటమి తప్పదని అనుకున్నారు. కానీ.. సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు.
ఆస్ట్రియా కెప్టెన్ అకిబ్ ఇక్బాల్ కేవలం 19 బంతుల్లో 2 ఫోర్లు, 10 సిక్సర్లతో 72 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు, 378.95 స్ట్రైక్ రేట్‌తో రొమేనియన్ బౌలర్లను చిత్తు చేశాడు. ఇమ్రాన్ ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. చివరి రెండు ఓవర్లలో 62 పరుగులు సాధించడంతో.. టీ20 క్రికెట్‌లోనే సంచలనంగా మారింది. పలువురు క్రీడానిపుణులు ఇదొక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.