29 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన క్రికెటర్

ఆస్ట్రేలియా వన్డే కప్‌లో దక్షిణ ఆస్ట్రేలియా బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ అరుదైన రికార్డును సృష్టించాడు.

By Srikanth Gundamalla
Published on : 8 Oct 2023 12:20 PM IST

south australia vs tasmania, 29 balls 100 runs, jake fraser,

 29 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన క్రికెటర్

ఆస్ట్రేలియా వన్డే కప్‌లో దక్షిణ ఆస్ట్రేలియా బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ అరుదైన రికార్డును సృష్టించాడు. చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అత్యంత వేగవంతమైన సెంచరీని బాదాడు. కరెన్‌ రోల్టన్‌ ఓవల్‌లో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో జేక్ ఫ్రేజర్ వీర బాదుడు బాది కేవలం 29 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా మాస్ట్రో ఏబీ డెవిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. గతంలో ఏబీ డెవిలియర్స్ 31 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేజర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం మొదటి 18 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇది ఆస్ట్రేలియన్‌ వన్డే దేశీయ క్రికెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌. అసమానమైన దూకుడుతో చారిత్రక సెంచరీని కూడా అందకున్నాడు జేక్ ఫ్రేజర్. ఆఫ్‌ సెంచరీ తర్వాత సెంచరీని చేరుకోవడానికి 11 డెలివరీలు మాత్రమే అవసరం అయ్యాయి. టాస్మానియాకు చెందిన సామ్‌ రెయిన్‌బర్డ్‌ వేసిన ఒకే ఓవర్‌లో 32 పరుగులు రాబట్టాడు జేక్‌ ఫ్రేజర్. ఇది మరో దేశీయ రికార్డును సమయం చేసినట్లు అయ్యింది. అయితే.. మొత్తం మీద జేక్‌ ఫ్రేజర్‌ 38 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉండగా.. అద్బుతమైన 13 సిక్సర్లు ఉన్నాయి. 125 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ తర్వాత జేక్‌ ఫ్రేజర్‌ ఔట్‌ అయ్యాడు. అంతకుముందు టాస్మానియా భారీ స్కోరుని టార్గెట్‌గా నిర్దేశించింది. 9 వికెట్లు కోల్పోయి 435 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన సౌత్‌ ఆస్ట్రేలియా ముందు దూకుడుగా ఆడినా.. వికెట్లనుకోల్పోయింది. దాంతో.. 398 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓపెనింగ్‌ అదరగొట్టినా దాన్ని మిగతా బ్యాటర్లు కంటిన్యూ చేయలేకపోయారు. అయితే.. మ్యాచ్‌ను కోల్పోయినా కూడా.. సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మాత్రం ఒక మెరుపు మెరిశాడు. చరిత్రను సృష్టించాడు.

Next Story