భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో విషాదం.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి

Siraj’s father passes away.. భారత యువ పేసర్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి మహ్మద్‌ గౌస్‌ (53)

By సుభాష్  Published on  21 Nov 2020 3:01 AM GMT
భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో విషాదం.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి

భారత యువ పేసర్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి మహ్మద్‌ గౌస్‌ (53) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్‌కు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లి కలిసి మహ్మద్‌ సిరాజ్‌కు ఈ సమాచారం అందించారు. ఐపీఎల్‌లో సిరాజ్‌ కోల్‌కతా జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చేసిన రోజే అతని తండ్రి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేసిన గౌస్‌.. కుమారుడిని ఈ స్థాయికి చేర్చడంలో ఎంతో శ్రమించారు.

అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న క్వారంటైన్‌ నిబంధనల కారణంగా మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు. దీంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ పేసర్‌ టెస్టు సిరీస్‌ కోసమే జట్టులోకి ఎంపికయ్యాడు. 'ఎంతో బాధగా ఉంది..పెద్ద దిక్కు కోల్పోయాను.. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆయన కోరికను తీర్చగలిగాను. జాతీయ జట్టు తరపున నేను ఎప్పుడు బాగా ఆడాలని నాన్న కోరుకునేవారు. నేను క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో కోచ్‌, కెప్టెన్‌ నాకు ఎంతో ధైర్యం చెప్పారు' అని మహ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నారు.

Next Story
Share it