పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్ ఫోగట్ సత్తా చాటింది.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2024 7:19 AM GMT
shock,  Indians, vinesh phogat, disqualified, Olympics,

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్ ఫోగట్ సత్తా చాటింది. ఆమె ఫైనల్ వరకు దూసుకెళ్లింది. అంతలోనే ఇండియా మొత్తానికి షాక్‌ తగిలే న్యూస్ చెప్పారు. ఆమె పతకంతో భారత్‌కు తిరిగి వస్తుందనుకుంటే.. అనర్హత వేటు వేశారు. 50 కిలోల విభాగంలో బుధవారం రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ ఫొగట్‌ రెజ్లింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె బరువును ముందుగా పరిశీలించిన నిర్వాహకులు సంచలన విషయాన్ని చెప్పారు. 100 గ్రాములు అదనంగా ఉండటం వల్ల ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం వివరాలను వెల్లడించింది. 'వినేశ్‌ ఫోగట్‌ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం' అని భారత ఒలింపిక్‌ సంఘం వివరించింది.


ఫోగట్‌పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆమెను ఓదార్చారు. ఈ మేరకు మాట్లాడిన ప్రధాని మోదీ ‘వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.



Next Story