పుష్ప స్టెప్ ట్రై చేసిన బంగ్లాదేశ్ స్టార్ 'షకీబల్ హసన్'

Shakib Al Hasan Copies Allu Arjun's movie from 'Pushpa' in BPL.పుష్ప సినిమా మేనియా మామూలుగా లేదు. ఎంతో మంది

By M.S.R  Published on  27 Jan 2022 7:29 AM GMT
పుష్ప స్టెప్ ట్రై చేసిన బంగ్లాదేశ్ స్టార్ షకీబల్ హసన్

'పుష్ప' సినిమా మేనియా మామూలుగా లేదు. ఎంతో మంది క్రికెటర్లు పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్, అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపించారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో, సురేష్ రైనా లిస్టులో చేరాడు. పుష్ప లోని సన్నివేశాలు, స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు కూడా తమ ఫాలోవర్స్ కోసం వేసి చూపించారు. చాలా మంది క్రికెటర్లు 'పుష్ప స్టెప్', 'శ్రీవల్లి' పాటకు సంబంధించిన డ్యాన్స్ స్టెప్‌ను ప్రదర్శించగా.. షకీబ్ అల్లు అర్జున్ మేనరిజం కాపీ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచ్‌లో షకీబ్ తన చేతిని గడ్డం మీద పెట్టి అల్లు అర్జున్ ఐకానిక్ మేనరిజంను ప్రదర్శించాడు.

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్‌ షకీబ్, కొమిల్లా విక్టోరియన్స్ వర్సెస్ ఫార్చ్యూన్ బరిషల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను అవుట్ చేసిన తర్వాత తన ట్యాలెంట్ ను ప్రదర్శించాడు. డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో ఆరో ఓవర్‌లో లాంగ్ ఆన్‌ లో సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షకీబ్ పుష్ప స్టైల్ లో వికెట్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఆసక్తికరంగా షకీబ్ సహచరులు డ్వేన్ బ్రావో, నజ్ముల్ ఇస్లాం కూడా పుష్ప సినిమా స్టెప్పులు వేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో వికెట్‌ తీశాక 'పుష్పలో అల్లు అర్జున్ వాక్' చేశాడు.

Next Story
Share it