సిక్సర్లతో సంజూ శాంసన్ విధ్యంసం.. చేతులెత్తేసిన సౌతాఫ్రికా
సంజూ శాంసన్ విధ్యంసకర సెంచరీ తర్వాత భారత స్పిన్నర్ల అద్భుతమైన ఆటతీరుతో తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 6:59 AM ISTసంజూ శాంసన్ విధ్యంసకర సెంచరీ తర్వాత భారత స్పిన్నర్ల అద్భుతమైన ఆటతీరుతో తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టు 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. సంజూ శాంసన్‌తో పాటు, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి భాటీమిండియా విజయంలో ముఖ్యమైన సహకారాన్ని అందించారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది.
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ సెంచరీతో భారత్ విజయానికి పునాది వేశాడు. 214 స్ట్రైక్ రేట్‌తో 50 బంతుల్లో 107 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్సులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ, 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. పీటర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయిన సంజూ శాంసన్.. ట్రిస్టన్ స్టబ్స్ చేతికి చిక్కి ఇన్నింగ్స్‌ను ముగించాడు.
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మంచి బౌలింగ్ చేశాడు. 6.20 ఎకానమీతో 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తొలుత ర్యాన్ రికెల్టన్ ని వరుణ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్‌ను, డేవిడ్ మిల్లర్ ను అవుట్‌చేశాడు. ర్యాన్ రికెల్టన్ 11 బంతుల్లో 21 పరుగులు, క్లాసెన్ 22 బంతుల్లో 25 పరుగులు, మిల్లర్ 22 బంతుల్లో 18 పరుగులు చేశారు.
వరుణ్ చక్రవర్తికి రవి బిష్ణోయ్ నుండి పూర్తి మద్దతు లభించింది. డర్బన్ బిష్ణోయ్ గూగ్లీ అద్భుతాలను చూసింది. బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో 7 ఎకానమీతో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలాన్‌లను అవుట్ చేశాడు.