బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే కాకుండా.. అతడితో పాటు పేసర్ నవదీప్ సైనీ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ధ్రువీకరించింది. గాయం నుంచి రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదని.. గాయం పూర్తిగా నయం కావడానికి మరింత సమయం పడుతుందని మెడికల్ టీమ్ నివేదిక వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. ఈ కారణం వల్ల రోహిత్ బంగ్లాదేశ్ తో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని తెలిపింది. పొత్తి కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్న నవ్ దీప్ షైనీ కూడా రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఆడబోయే జట్టును బీసీసీఐ ప్రకటించింది. రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ పేర్కొంది.
రెండో టెస్టుకు భారత జట్టు :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.