ఆర్‌సీబీ ఆటగాడిపై అక్కడ నిషేధం
ఐపీఎల్ సీజన్-2024కు ఇంకా సమయం ఉంది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 5:38 PM ISTఆర్‌సీబీ ఆటగాడిపై అక్కడ నిషేధం
ఐపీఎల్ సీజన్-2024కు ఇంకా సమయం ఉంది. కానీ.. ఆక్షన్ నుంచే ఐపీఎల్‌పై ఆసక్తి పెరిగిపోయింది. ఆయా టీమ్‌లు కొత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. దాంతో.. ఈసారి మ్యాచ్‌లు మరింత ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయనేది మాత్రం అర్థం అవుతుంది. అయితే.. ఇటీవల ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన ఆటగాడికి షాక్ ఎదురైంది. ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతను బిగ్‌బాష్ లీగ్-2023-24 సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డిసెంబర్ 11న హోబర్ట్ హేరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను టామ్ కర్రన్‌ను బెదిరించాడు. ఈ క్రమంలోనే టామ్ కర్రన్‌కు బీబీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
హోబర్ట్‌తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ల పట్ల దురుసుగా ప్రవర్తించాడు అనీ.. బీబీఎల్ నిర్వాహకులు చెప్పారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అంపైర్ వారించాడనీ.. కానీ కర్రన్ లెక్కచేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయడాని పేర్కొన్నారు. చెప్పినా వినకుండా అంపైర్‌పై బౌలింగ్ ప్రయోగించడం సీరియస్‌గా తీసుకున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే కర్రన్‌పై లెవెల్-3 నేరం కింద పరిగణించి.. నాలుగు మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించారు. ఈ మేరకు బీబీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. డిసెంబర్ 11న బీబీఎల్‌లో భాగంగా జరిగిన హోబర్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్బుతంగా రాణించాడు.తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 మూడు వికెట్లు తీశాడు కర్రన్. అలాగే బ్యాటింగ్‌లో కూడా బౌండరీ బాది జట్టును విజతీరాలకు చేర్చాడు.
ఇక ఇటీవల దుబాయ్ వేదికగా ఐపీఎల్-2024 సీజన్‌కు వేలం జరిగిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ జట్టు టామ్ కర్రన్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున టామ్ కర్రన్ 13 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున రెండు టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు టామ్ కర్రన్. సామ్ కర్రన్‌కు ఈ ప్లేయర్ అన్న వరుస అవుతాడు.