వంద సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేయగలడు: రవిశాస్త్రి

ఈ వన్డే వరల్డ్‌ కప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 11:59 AM GMT
ravi shastri,  virat kohli, hundred centuries,

వంద సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేయగలడు: రవిశాస్త్రి

ఈ వన్డే వరల్డ్‌ కప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరుమీదున్న వన్డేల్లో అత్యధిక సెంచరీలను కోహ్లీ తిరగరాశాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో వన్డేల్లో తన మొత్తం సెంచరీలను 50కి చేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ 291 వన్డేల్లో 50 సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు. 25 ఏళ్లుగా సచిన్‌ రికార్డును తన పేరుమీదకు మార్చకున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ గురించి రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండటం.. మరో మూడు, నాలుగేళ్లు కొనసాగే సత్తా అతనిలో ఉందన్నాడు రవిశాస్త్రి. దాంతో.. 100 సెంచరీ మార్క్‌ అతనికి పెద్ద కష్టం కాదని చెప్పాడు. టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన రవిశాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు. సచిన్‌ వంద సెంచరీలు చేసినప్పుడు దరిదాపుల్లోకి కూడా ఎవరూ వస్తారని అనుకోలేదని.. కానీ కోహ్లీ ఇప్పటికే 80 సెంచరీలు చేశాడని చెప్పారు రవిశాస్త్రి. 80 అంతర్జాతీయ సెంచరీల్లో వన్డేల్లోనే 50 సెంచరీలు ఉన్నాయని అన్నారు. ఇది అత్యద్భతంగా పేర్కొన్నారు. ఏదీ అసాధ్యం అనేది ఉండదనీ.. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్స్‌ సెంచరీలు కొట్టడం మొదలు పెడితే చేస్తూనే ఉంటారని అన్నారు రవిశాస్త్రి.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు కాబట్టి వంద సెంచరీలు పూర్తి చేయడం అతనికి పెద్ద కష్టం కాదన్నారు. తర్వాతి 10 ఇన్నింగ్స్‌లోనే మరో ఐదు సెంచరీలు చేయొచ్చని రవిశాస్త్రి అభిప్రాయ పడ్డారు. మూడునాలుగేళ్లు ఆడే అవకాశం ఉందని.. 100 సెంచరీల మార్క్‌ను కూడా దాటే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒత్తిడి తట్టుకుని పరుగులు సాధించే సత్తా విరాట్‌లో ఉందన్నాడు. ప్రస్తుతం విరాట్ ఆట అత్యద్భుతంగా ఉందని రవిశాస్త్రి పొగిడారు.

కాగా.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌ కప్‌లో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 10 మ్యాచ్ లలో 711 రన్స్ తో ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ (673) రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఫైనల్లోనూ ఆడబోతున్నాడు.

Next Story