చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్

Punjab Kings Beat Chennai Super Kings. చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ కింగ్స్ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

By M.S.R  Published on  30 April 2023 8:06 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ కింగ్స్ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్ లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రజా (13 నాటౌట్), షారుఖ్ ఖాన్ (2) విజయాన్ని అందించారు. ఆఖరి బంతికి 3 పరుగులు తీయాల్సి ఉండగా, పతిరణ వేసిన స్లో డెలివరీని సికిందర్ రజా లెగ్ సైడ్ కొట్టాడు. చెన్నై ఫీల్డర్లు ఆ బంతిని బౌండరీని చేరనివ్వనప్పటికీ సికిందర్ రజా, షారుఖ్ ఖాన్ 3 పరుగులు తీయడంతో విజయం పంజాబ్ నే వరించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (42), కెప్టెన్ శిఖర్ ధావన్ (28) తొలి వికెట్ కు 50 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. లియామ్ లివింగ్ స్టోన్ (24 బంతుల్లో 40), శామ్ కరన్ (29), జితేశ్ శర్మ (10 బంతుల్లో 21) దూకుడుగా ఆడి రన్ రేట్ తగ్గకుండా చేశారు. చివర్లో సికిందర్ రజా, షారుఖ్ ఖాన్ పంజాబ్ ను విజేతగా నిలిపారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో అజేయంగానిలిచాడు. 52 బంతులు ఆడి 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సులు కొట్టాడు. ధోనీ 4 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 37, శివమ్ దూబే 28, మొయిన్ అలీ 10, రవీంద్ర జడేజా 12 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, శామ్ కరన్ 1, రాహుల్ చహర్ 1, సికిందర్ రజా 1 వికెట్ తీశారు.


Next Story