పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పథకం అడుగు దూరంలో ఉంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 4:58 AM GMTపారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పథకం అడుగు దూరంలో ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. సెమీస్‌కు వెళ్లింది. అయితే.. తాజాగా మన హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. బ్రిటన్ తో జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో రోహిత్ దాస్ హాకీ ఫెడరేషన్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వెల్లడించింది. దాంతో.. అతడిపై చర్యలు తీసకున్నారు ఎఫ్‌ఐహెచ్ ప్రతినిధులు. ఒలింపిక్స్‌లో మంగళవారం జర్మనీతో తలపడనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. దీనికి సంబంధించి పారిస్ ఒలింపిక్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆదివారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌లో మొదటి రెండు నిమిషాలకే భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడు విలిమ్ కల్నల్ తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని ఆరోపిస్తూ రిఫరీలు రోహిదాస్‌ను బయటకు పంపారు. దాంతో.. హర్మన్‌ప్రీస్ సేన మిగిలిన మ్యాచ్‌ను 10 మందితోనే ఆడింది. కీలక ఆటగాడు ఫీల్డ్‌లో లేకున్నా భారత్ నిరాశచెందలేదు. రెండో క్వార్టర్ ముగియకుమందే 27వ నిమిషంలో లీ మోర్టన్ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. తర్వాత రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది.
షూటౌట్‌లో బ్రిటన్ తరఫున అల్బరి జేమ్స్, వాలేస్ జాక్ రెండు గోల్స్ కొట్టారు. భారత్ నుంచి హర్మన్ ప్రీత్, సుఖ్‌జీత్ గోల్స్ చేసి స్కోర్లను సమం చచేశారు. మూడో గోల్ కోసం వచ్చిన విలియమ్సన్ కానర్ ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకున్నాడు. దాంతో.. బ్రిటన్ జట్టు కాస్త టెన్షన్ పడ్డది. లలిత్ ఉపాధ్యాయ మూడో గోల్ చేయడంతో 3-2తో ఆధిక్యంలోకి చేరుకుంది. బ్రిటన్‌కు చివరి అవకాశంగా వచ్చిన రోపర్ ఫిలిప్ కూడా గోల్ కొట్టలేకపోయాడు. రాజ్‌కుమార్ పాల్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి ఇండియాకు విజయాన్ని అందించారు. తద్వారా భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో విజయం సాధిస్తే భారత్‌కు మరో పతకం రానుంది.