నీరజ్‌ గోల్డ్‌ గెలిస్తే లక్కీ విన్నర్‌కు రూ.1,00,089.. రిషబ్‌ సంచలన ప్రకటన

పారిస్‌ ఒలింపిక్స్‌ ఘనంగా కొనసాగుతున్నాయి. భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2024 10:32 AM IST
paris Olympics, Neeraj chopra,  final, Rishabh, sensational tweet,

నీరజ్‌ గోల్డ్‌ గెలిస్తే లక్కీ విన్నర్‌కు రూ.100089.. రిషబ్‌ సంచలన ప్రకటన

పారిస్‌ ఒలింపిక్స్‌ ఘనంగా కొనసాగుతున్నాయి. భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ (గ్రూప్‌ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు నీరజ్ చోప్రా. గ్రూప్‌-బిలో నీరజ్‌దే అగ్రస్థానం. ఇతనితో పాటు తొలి ప్రయత్నంలోనే గ్రెనెడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ (88.63 మీ) రెండో స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్‌ (86.59 మీ) మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఎక్స్‌ వేదికగా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ సంచలన పోస్టు పెట్టాడు. గురువారం జరగబోయే ఈ ఫైనల్‌లో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్ గెలిస్తే భారీ ఎత్తున ప్రైజ్‌ మనీ ఇస్తానంటూ సోషల్ మీడియా యూజర్లకు చెప్పాడు. ఇందుకు తన ఎక్స్‌లో కామెంట్‌ చేసిన వారిలో ఒక లక్కీ అభిమానికి రూ.100089 ప్రైజ్‌ మనీ ఇస్తానని ప్రకటించాడు. ఇందుకోసం లైక్‌ కొట్టి కామెంట్ చేయాల్సి ఉంటుందని రిషబ్ పేర్కొన్నాడు. అంతేకాదు.. మిగిలిన వారిలో మొదటి 10 మంది వ్యక్తులకు విమాన టికెట్లను కొనిస్తానని రిషభ్ పంత్ చెప్పాడు. ప్రస్తుతం ఇతని పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీరజ్‌కు మద్దతుగా అనేక మంది కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు.. రిషబ్‌ మొదలుపెట్టిన ఈ కాంటెస్ట్‌ ను మిగతా వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు కూడా నీరజ్‌ గోల్డ్ గెలిస్తే తాము కూడా ప్రైజ్ మనీ లక్కీ నెటిజన్లకు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. రిషబ్‌ పెద్ద మొత్తంలో అమౌంట్‌ ఇస్తానని చెప్పడంతో నెటిజన్లు ఈ పోస్టును తెగ లైక్‌ కొడుతూ .. కామెంట్ల మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి నీరజ్ గెలిస్తే లక్షా 89 రూపాయలు ఎవరికి దక్కుతాయో చూడాలి.


Next Story