వినేష్ అనర్హత వేటు తీర్పుపై ఆసక్తి..CASలో కౌన్సిల్ వాదనలు
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 6:45 AM GMTవినేష్ అనర్హత వేటు తీర్పుపై ఆసక్తి..CASలో కౌన్సిల్ వాదనలు
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఈసారి ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఆరు పతకాలతో సరిపెట్టుకున్నారు. అయితే.. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె ఫైనల్‌కు ఎంపికైన తర్వాత అనర్హత వేటుకు గురయ్యారు. కేవలం 100 గ్రాముల బురువు అధికంగా ఉన్నారనే కారణంగా ఒంటిపిక్స్ నిర్వాహకులు ఆమెను పక్కకు పెట్టారు. ఈ అంశంపై వినేష్ ఫోగట్ గట్టిగా పోరాడుతోంది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాదనలు జరిగాయి వినేశ్ ఫోగట్ అనర్హత వేటు విషయంలో తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు CASలో వినేష్ ఫోగట్ కౌన్సిల్ గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
అక్కడి పత్రిక ప్రకటనల ప్రకారం ఫోగట్ కౌన్సిల్ CASలో స్ట్రాంగ్‌గా విదనలు వినిపించినట్లు తెలిసింది. కేవలం వంద గ్రాముల బరువు అదనంగా ఉండటం వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉండదని కౌన్సిల్ వాదించింది. ఈ విషయాన్నే పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని తెలిపింది. అథ్లెట్ మొత్తం బరువులో అది కేవలం 0.1 నుంచి 0.2 పర్సంటేజీ మాత్రమే ఉంటుందని పేర్కొంది. వేసవికాలంలో ఉబ్బరం వల్ల అదనపు బరువు వచ్చేందుకు ఛాన్స్ ఉందని చెప్పింది. వేడిని తట్టుకోవడానికి ఎక్కువగా నీటిని శరీరం అట్టిపెట్టుకుంటుందనీ.. దీనివల్ల కండరాలు పెరుగుతాయని వివరించింది. అలాగే ఒకేరోజు అథ్లెట్ మూడుసార్లు పోటీ పడిందనీ.. దాంతో ఆహారం ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది. చివరి బౌట్ కోసం బరిలో దిగేందుకు కొద్ది సమయం ఉన్న కారణంగా.. బరువుని తగ్గించుకోవడానికి ఫోగట్ చాలా శ్రమించిందని ఆమె తరఫు కౌన్సిల్ CASలో వాదనలు వినిపంచింది. ఫైనల్‌కు ఆమె చాలా కష్టపడ్డారనీ.. అవాంతరాలను ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చారని చెప్పింది.
ఒలింపిక్స్‌లో ఫోగట్‌ను డిస్‌క్వాలిఫై చేసిన అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తీర్పు మరో సారి వాయిదా పడింది. భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 13న తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒలింపిక్స్ ఇప్పటికే ముగిశాయి. ఈ క్రమంలో తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తి కొనసాగుతోంది.