లుసానె డైమండ్‌ లీగ్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన నీరజ్‌ చోప్రా

లుసానె డైమండ్‌ లీగ్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 11:05 AM IST
Neeraj Chopra, Gold Medal, Lausanne Diamond League,

లుసానె డైమండ్‌ లీగ్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన నీరజ్‌ చోప్రా

లుసానె డైమండ్‌ లీగ్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌, ఒలింపిక్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రా అదగొట్టాడు. ఈ టోర్నీలో 87.66 మీటర్లు జావెలిన్‌ విసిరి తొలిస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో నీరజ్‌ విఫలం అయ్యాడు. దీంతో అభిమానులు టెన్షన్ పడ్డారు కానీ.. రెండు, మూడో ప్రయత్నాల్లో 85 మీటర్ల దూరం అందుకున్నాడు. దాంతో పతకం ఆశలు నిలబడ్డాయి. ఇక నాలుగో ప్రయత్నంలో తడబిడినా.. చివరి చాన్స్‌లో పట్టుదలగా బళ్లాన్ని విసిరాడు. చివరి చాన్స్‌లో 87.66 మీటర్లు జావెలిన్‌ విసిరి తొలి స్థానంలో నిలిచాడు నీరజ్‌ చోప్రా. ప్రత్యర్థుల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి అగ్రస్థానం సాధించాడు. గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నాడు.

కాగా.. నీరజ్‌కు జర్మన్ ప్లేయర్ వెబర్ గట్టిపోటీ ఇచ్చాడు. నీరజ్‌ చోప్రాను దాటేందుకు చాలా ప్రయత్నించాడు. చివరి చాన్స్‌లో వెబర్‌ 87.03 మీటర్లు బళ్లాన్ని విసిరాడు. దాంతో రెండోస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మూడో స్థానంలో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాక్‌ నిలిచాడు.

Next Story