ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోన్న ఎంఎస్ ధోనీ.. వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla
ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోన్న ఎంఎస్ ధోనీ.. వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ట్రెండ్‌లోనే ఉంటారు. అప్పుడప్పుడు బయటకు తిరుగుతూ కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే.. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఉన్నాడు. 2025 సీజన్‌లో ఆయన ఆడుతారా లేదా అన్నది తెలియదు. ఆయన ఐపీఎల్‌లో ఆడేందుకు కూడా గుడ్‌బై చెబతారని వార్తలు వచ్చినా.. క్లారిటీ లేదు. తాజాగా ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విలువైన సమయాన్ని ఫ్యామిలీకి మాత్రమే కాదు.. ఫ్రెండ్స్‌తో కూడా గడుపుతున్నాడు.
ఎంఎస్ ధోనీ తాజాగా తన స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాంచీలోని ఓ లోకల్ ధాబాలో తన మిత్రులతో కలిసి లంచ్‌ను ఎంజాయ్ చేశాడు ధోనీ. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి టైమ్ స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచింది. 2024 సీజన్‌లో మాత్రం కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశాడు. తానే వికెట్ కీపర్‌గా కొనసాగాడు. కానీ.. అవసరమైన సమయంలో సూచనలు చేస్తూ వచ్చాడు ధోనీ. ప్రస్తుతం ధోనీ మరో సీజన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ధోనీ 2025 ఐపీఎల్ సీజన్‌లో కొత్త అవతారంలో సీఎస్‌కేకి అండగా నిలిచే అవకాశముందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
MS Dhoni enjoying the weekend with friends. ❤️#Cricket #Dhoni #IPL #CSK #Friends pic.twitter.com/KNoddh7BGo
— Sportskeeda (@Sportskeeda) August 20, 2024