ఆ ముగ్గురు క్రికెటర్లంటే చాలా ఇష్టం: మనూ బాకర్
భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 10:08 AM ISTఆ ముగ్గురు క్రికెటర్లంటే చాలా ఇష్టం: మనూ బాకర్
భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె ఏకంగా రెండు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒలింపిక్స్ తర్వాత ఆమె సోషల్ మీడియాలో తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రాతో ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చిన విషయంతెలిసిందే. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనూ బాకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్రికెట్‌లో తనకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్లను చెప్పిన ఆమె.. వారితే మాట్లాడుతూ సమయం గడపాలని ఉందని చెప్పింది.
ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మను బాకర్.. తనకు చాలా మంది క్రీడాకారులు అంటే ఇష్టమని చెప్పింది. అందులో కొందరి పేర్లను ఆమె చెప్పుకొచ్చింది. జమైకా స్టార్ రన్నర్ ఉసేన్‌బోల్ట్ తన ఫేవరేట్ అథ్లెట్ అని చెప్పింది మను. ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా చదివానని చెప్పింది. బోల్ట్ ప్రయాణం తనకెప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పింది. ఆయన ఇంటర్వ్యూలు కూడా చూశానని అన్నది. మరోవైపు భారత్‌కు చెందిన ఉగ్గురు క్రికెటర్లు అంటే ఎంతో అభిమానమని మను బాకర్ చెప్పింది. సచిన్ టెండూల్కర్, ధోనీ, విరాట్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వారితో కాసేపు మాట్లాడినా చాలనీ.. ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని మను బాకర్ తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత లాస్‌ఏంజెల్స్‌లో జరగబోయే ఈవెంట్ లో గోల్డ్ మెడల్ గెలవడంపై దృష్టి పెట్టినట్లు మను బాకర్ తెలిపింది. భారత్ కోసం ఒక క్రీడాకారిణిగా భాగస్వామ్యం అందించాలనే తపన ఎప్పుడూ తనలో ఉంటుందని మను బాకర్ చెప్పింది. భారత్‌కు పతకాలు సాధించడం కోసం ఎప్పడూ కృషి చేస్తూనే ఉంటానని తెలిపింది.