క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న 'కెవ్వు కేక' భామ‌

Malaika Arora Gets Corona Vaccine . బాలీవుడ్ ఐటం బాంబ్‌ మ‌లైకా ఆరోరా కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకుంది.

By Medi Samrat  Published on  2 April 2021 1:28 PM IST
Malaika Arora Gets Corona vaccine

బాలీవుడ్ ఐటం బాంబ్‌ మ‌లైకా ఆరోరా కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకుంది. శుక్ర‌వారం నాడు వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్న‌ట్లు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌లో పోస్టు చేసింది. మ‌లైకా ఆరోరా వ‌య‌సు ప్ర‌స్తుతం 47 ఏళ్లు. కేంద్రం నిన్న‌టి నుండి 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా ఇస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా మ‌లైనా త‌న ఇన్‌స్టా లో.. అంద‌రూ క‌రోనా టీకా వేసుకోవాల‌ని కోరారు. కొవిడ్‌పై యుద్ధంలో గెల‌వాల‌న్నారు. టీకా తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు అంటూ ఆమె రాసుకొచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి తాను అర్హురాల‌ని ఆమె త‌న సందేశంలో పేర్కొంది.

ఇదిలావుంటే.. మ‌లైకా ఆరోరాకు సెప్టెంబ‌ర్‌లో క‌రోనా సోకిన‌ విష‌యం తెలిసిందే. పాజిటివ్ తేలిన త‌ర్వాత ఆమె క్వారెంటైన్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత‌ ఆమె బాయ్‌ఫ్రెండ్ అర్జున్ క‌పూర్‌కు కూడా.. అదే స‌మ‌యంలో క‌రోనా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక ప‌వ‌న్ క‌ళ్యాన్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో.. కెవ్వు కేక పాట‌లో ఆడిపాడిన‌ మ‌లైకాకు తెలుగు నాట కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.




Next Story