స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం, కెనడా ఓపెన్ టైటిల్ కైవసం
భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 8:13 AM GMTస్టార్ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం, కెనడా ఓపెన్ టైటిల్ కైవసం
భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు.భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. కెనడా ఓపెన్ సింగిల్స్ టైటిల్ (Canada Open 2023 title)కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2023లో తన తొలి టైటిల్ గెలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా సాగిన పోరులో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ లి షి ఫెంగ్‌ను లక్ష్యసేన్ ఓడించాడు. చైనాకు చెందిన లి షి ఫెంగ్‌ను 21-18, 22-20తో వరుస సెట్లలో ఓడించి లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు లక్ష్యసేన్. రెండో సెట్‌లోనే లి షి ఫెంగ్‌కు షాక్ ఇచ్చి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లో లక్ష్యసేన్ కనబర్చిన ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. మెరుపు వేగంతో షాట్స్ ఆడాడు. 21 ఏళ్ల లక్ష్యసేన్‌కు ఇది రెండో బడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిట్. జనవరి 2022లో ఇండియా ఓపెన్ గెలిచాడు. ఆ తర్వాత లక్ష్యసేన్ గెలిచిన రెండో బడ్బ్యూఎఫ్ వరల్డ్ టూర్ (BWF World Tour title) టైటిల్ ఇదే.
ఇక అంతకు మందు సెమీ ఫైనల్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ లక్ష్యసేన్ మాత్రం ఫైనల్‌లో సత్తా చాటి టైటిల్ గెలుచుకున్నాడు. కొన్నిసార్లు కష్టతరమైన పోరాటాలు.. మధురమైన విజయాలకు దారితీస్తాయని అన్నాడు లక్ష్యసేన్. నీరిక్షణ ముగిసిందని.. కెనడా ఓపెన్ విజేత అయినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక తన ట్విట్టర్‌లో తనను సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు లక్ష్యసేన్.
ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ 19వ స్థానంలో ఉన్నాడు. రౌండ్ దశలోనే నాల్గవ ర్యాంకర్ కున్లావుడ్ విటిడ్‌సర్న్‌ను ఓడించాడు. ఇక సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటోపై గెలిచి ఫైనల్‌కి దూసుకొచ్చాడు. సెమీస్‌లో కూడా రెండు సెట్లలో గెలిచి ప్రతిభను చాటాడు. స్మాష్ షాట్స్ ఆడుతూ చివరకు కెనడా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు లక్ష్యసేన్.