మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..!
అబుదాబి టీ10 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీని ఓడించింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:37 AM ISTఅబుదాబి టీ10 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీని ఓడించింది. గ్లాడియేటర్స్ కేవలం 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ హాఫ్ సెంచరీ సాధించాడు. డెక్కన్ గ్లాడియేటర్స్ మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీని ఓడించి చరిత్ర సృష్టించింది. తద్వారా అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ మూడోసారి గెలుచుకుంది. ఇంతకుముందు 2021, 2022లో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. డెక్కన్ గ్లాడియేటర్స్ మూడు టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మోరిస్‌విల్లే సంప్ ఆర్మీ జట్టు 104 పరుగులు చేసింది. జట్టు తరఫున ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేశాడు. చరిత్ అసలంక 13 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆండ్రిస్ గౌస్ తొమ్మిది బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిదో ఓవర్‌లో డు ప్లెసిస్, జాక్ టేలర్‌లను అవుట్ చేయడం ద్వారా గ్లీసన్ సంప్ ఆర్మీని డబుల్ దెబ్బ కొట్టాడు.
ఆ తర్వాత డెక్కర్ గ్లాడియేటర్స్ ఓపెనర్ కోహ్లర్-కాడ్మోర్(56) ముస్తఫా బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టడం ద్వారా పరుగుల వేటను ప్రారంభించాడు. రెండో ఓవర్‌లో పూరన్ ఇన్నింగ్స్ తొలి సిక్స్ బాదాడు. ఆ తర్వాత పూరన్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వాసిమ్‌ను టార్గెట్‌గా చేసుకుని రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఆపై ఇసురు ఉదానా నాలుగో ఓవర్‌లో పురన్ వికెట్ తీసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కెప్టెన్ పురన్ 10 బంతుల్లో 28 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రిలే రోసౌవ్ 12 పరుగులు, జోస్ బట్లర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో డెక్కర్ గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.