ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీకి ఎంత దక్కిందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 అసాధారణ రీతిలో ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ 3వ టైటిల్‌ను కైవసం చేసుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ పతకంతో సరిపెట్టుకోగలిగింది

By M.S.R  Published on  27 May 2024 10:15 AM IST
ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీకి ఎంత దక్కిందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 అసాధారణ రీతిలో ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ 3వ టైటిల్‌ను కైవసం చేసుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ పతకంతో సరిపెట్టుకోగలిగింది. టోర్నమెంట్ చాలా వరకూ భారీ మెరుపులతో జరగగా.. ఫైనల్ మాత్రం చాలా చప్పగా సాగింది. ఐపీఎల్ ఫైనల్ లో అతి తక్కువ స్కోరును నమోదు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరమైన రికార్డును సొంతం చేసుకుంది.

ఫైనల్ లో విజయంతో, KKR జట్టు 20 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీని పొందగా.. రన్నరప్ గా నిలిచిన SRH కు 12.5 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ సందర్భంగా IPL రిజర్వ్ చేసిన మొత్తం ప్రైజ్ మనీ INR 46.5 కోట్లు. ఇది కేవలం ఫైనల్ లో విజేతకు, రన్నరప్‌ల మధ్య మాత్రమే పంపిణీ చేయరు. పాయింట్ల పట్టికలో వరుసగా 3వ, 4వ స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లకు కూడా తగిన మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. మూడో స్థానంలో నిలిచినందుకు సంజూ శాంసన్ జట్టుకు రూ. 7 కోట్లు ఇవ్వగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 6.5 కోట్లు లభించాయి. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, పర్పుల్ క్యాప్ పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్‌కు దక్కింది. ఇద్దరూ ఒక్కొక్కరు రూ.10 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నారు.

Next Story