భార‌త్‌ న‌డ్డి విరిచిన కివీస్‌ స్పిన్న‌ర్‌ను క్లబ్ బౌలర్‌తో పోల్చిన కైఫ్..!

ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0తో భారత్‌ను ఓడించింది. ఈ సిరీస్‌లోని చివరి టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 10:46 AM GMT
భార‌త్‌ న‌డ్డి విరిచిన కివీస్‌ స్పిన్న‌ర్‌ను క్లబ్ బౌలర్‌తో పోల్చిన కైఫ్..!

ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0తో భారత్‌ను ఓడించింది. ఈ సిరీస్‌లోని చివరి టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఇందులో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత జట్టు ఓటమిలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత‌ అజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ కివీ బౌలర్‌ను ఇండియన్ క్లబ్ బౌలర్‌తో పోల్చాడు.

అజాజ్ టెస్ట్ క్రికెట్‌లో చాలా తక్కువ మంది మాత్రమే చేయగలిగిన ఒక ఫీట్ చేసాడు. ఇది దాదాపు అసాధ్యంగా పరిగణించబడుతుంది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ అజాజ్. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు ముగ్గురు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అజాజ్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే రికార్డు సాధించారు. అజాజ్ 2021లో ముంబైలో భారత్‌పై ఈ ఫీట్ సాధించాడు.

అయితే.. కైఫ్ తన X హ్యాండిల్‌లో భారత్‌, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గురించి చర్చిస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సమయంలో అతను అజాజ్ పటేల్ బౌలింగ్ గురించి మాట్లాడాడు. గ్లెన్ ఫిలిప్స్ అజాజ్ పటేల్ అని, నేను అబద్ధం చెప్పను, ఢిల్లీలో నేను ప్రాక్టీస్ చేసే ఆర్పీ అకాడమీలో ఇలాంటి బౌలర్లు రోజూ కనిపిస్తారు.. అజాజ్ పటేల్ వేసిన బంతుల పిచ్ మ్యాప్ చూస్తే.. రెండు బంతులు మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. రెండు ఫుల్ టాస్‌లు బౌలింగ్. రెండు లెంగ్త్ బంతులను బౌలింగ్ చేశాడు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన ఫిలిప్స్.. ఎప్పుడూ ఇంత బౌలింగ్ చేయడు.. ఫుల్ టాస్ బౌలింగ్ చేస్తున్నాడు .. కీపర్ బైస్ ఇస్తున్నాడు.. ఇది జీరో బౌలింగ్ అని అర్థం. మేము పార్ట్ టైమర్ల చేతిలో ఓడిపోయాము.. వాంఖడేలో అజాజ్ పటేల్ 22 వికెట్లు పడగొట్టినప్పటికీ.. అత‌డి బంతి బంతిని చూస్తే.. బంతులు స‌రిగా ప‌డ‌లేదు. ఓవ‌ర్‌లో రెండు బంతులు మాత్రమే అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడని కామంట్స్ చేశాడని కామెంట్స్ చేశాడు.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై కూడా కైఫ్ వ్యాఖ్య‌లు చేశాడు. న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయలేకపోయారని.. అయిన‌ప్పటికీ భారత బ్యాట్స్‌మెన్ వారిని ఎదుర్కోలేకపోయారని అన్నాడు.

Next Story