వన్డే వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్ అతడే అవుతాడు: జో రూట్
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూటర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 7 Sept 2023 4:00 PM ISTవన్డే వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్ అతడే అవుతాడు: జో రూట్
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఈ టోర్నీ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి కప్ గెలుచుకోవాలని టీమ్‌లు భావిస్తున్నాయి. దాని కోసం సమయాత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టాప్ స్కోరర్.. బెస్ట్ బౌలర్‌గా ఎవరు నిలుస్తారనే దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూటర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిర్ స్టో టాప్‌స్కోరర్‌గా నిలుస్తాడని జో రూట్ అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రపంచకప్ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన జట్లన్నీ ఎలాగైనా టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల జట్లు టీమ్‌లను కూడా ప్రకటించాయి. ఈ టోర్నీకి భారత్ వేదిక కానుంది. దాంతో.. సొంత గడ్డపై టీమిండియా సంచలనం సృష్టిస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇక అభిమానులు కూడా భారత జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు.. ఇప్పుడిప్పుడే రాణిస్తున్న శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇతర ఆటగాళ్లు చెలరేగి ఆడి భారత్‌కు ఐసీసీ కప్ తీసుకొస్తారని అనుకుంటున్నారు.
అయితే.. ఈ టోర్నీలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారనే దానిపై చర్చ అప్పుడే మొదలైపోయింది. ఫామ్‌లో ఉన్న బాబర్ ఆజామ్, శుభ్‌మన్ గిల్, రోహిత్, విరాట్ కోహ్లీల్లో ఎవరో ఒకరు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నిలుస్తాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాడ్ ఆటగాడు ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో జోరూట్ పేరుని చేర్చాడు. ఐపీఎల్‌లో జోరూట్ ఎలా రాణించాడో అందరికీ తెలిసిందే. అదే జోరుని కొనసాగిస్తాడని జో రూట్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బెయిర్‌స్టో పరిమితి ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడని, టాప్ ఆర్డర్‌లో అతడెంతో నిలకడగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. మరోవైపు.. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడని జోరూట్ చెప్పాడు. బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు మంచి నైపుణ్యం ఉందని.. అనుకూలించే పిచ్‌లపై అతడు కచ్చితంగా సత్తా చాటుతాడని అన్నాడు. అలాగే తాము కప్ గెలిచి తీరతామని అన్నాడు జో రూట్. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో ఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. అక్టోబర్ 29న లక్నోలో భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుంది.