IPL 2023: ఏడ్చేసిన దయాళ్‌కు మద్దతుగా కేకేఆర్ ట్వీట్

కేఆర్, యష్ దయాళ్ కి అండగా ట్వీట్ చేసింది. ‘నువ్వు ఛాంపియన్‌‌వి. ఈ రోజు నీకు కలిసి రాలేదు అంతే. క్రికెట్‌లో బెస్ట్

By M.S.R  Published on  10 April 2023 3:15 PM IST
Yash Dayal, IPL 2023,  KKR , Rinku Singh

IPL 2023: ఏడ్చేసిన దయాళ్‌కు మద్దతుగా కేకేఆర్ ట్వీట్ 

క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని ఊరికే అనలేదు. ఆటగాళ్లు హుందాతనాన్ని నిలుపుకునే ఎన్నో ఘటనలు మనం చూశాం. ఇక గత రాత్రి కేకేఆర్ లాస్ట్ ఓవర్ లో అద్భుతం చేసి మ్యాచ్ ను గుజరాత్ నుండి దూరం చేసింది. ముఖ్యంగా రింకూ సింగ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కు గుజరాత్ బౌలర్ యశ్ దయాళ్ బలయ్యాడు. ఆఖరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టేశాడు రింకూ సింగ్. 3 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చిన యష్ దయాల్, ఆఖరి ఓవర్ మొదటి బంతికి సింగిల్ ఇచ్చాడు.. ఆ తర్వాత వేసిన అన్ని బంతులను రింకూ సింగ్‌ సిక్సర్లుగా మలిచాడు. దీంతో కేకేఆర్ జట్టు ఆనందంలో మునిగిపోగా.. దయాళ్ మాత్రం బాధతో గ్రౌండ్ లో కింద కూర్చోనేశాడు.

మ్యాచ్ అనంతరం కేకేఆర్, యష్ దయాళ్ కి అండగా ట్వీట్ చేసింది. ‘నువ్వు ఛాంపియన్‌‌వి. ఈ రోజు నీకు కలిసి రాలేదు అంతే. క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్లు అందరికీ ఇలా జరుగుతుంది. యష్, నువ్వు మంచి కమ్‌బ్యాక్ ఇస్తావ్’ అంటూ ట్వీట్ చేసింది కోల్‌కత్తా నైట్‌ రైడర్స్. ఈ రకమైన స్పందనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story