అవేశ్ ఖాన్ ఓవరాక్షన్.. మ్యాచ్ రిఫరీ ఏమన్నాడంటే

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రిఫరీ మందలించాడు.

By M.S.R  Published on  11 April 2023 12:00 PM IST
IPL 2023 , Avesh Khan, LSG, RCB

అవేశ్ ఖాన్ ఓవరాక్షన్.. మ్యాచ్ రిఫరీ ఏమన్నాడంటే 

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రిఫరీ మందలించాడు. ఏప్రిల్ 10, సోమవారం జరిగిన IPL 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై జట్టు చివరి ఓవర్‌లో లక్నో ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ తిరిగారు. దీంతో రన్ అవుట్ ప్రమాదాన్ని అవేశ్ ఖాన్ తప్పించుకోగానే హెల్మెట్ ను తీసి కిందకు విసిరాడు. దీంతో అతడిని రిఫరీ మందలించాడు. "ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ అవేష్ ఖాన్‌ను మందలించారు. IPL ప్రవర్తనా నియమావళి 2.2 స్థాయి 1 నేరాన్ని అవేష్ అంగీకరించాడు." అని IPL నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ కు భారీ జరిమానా విధించారు. ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్న మొదటి కెప్టెన్ గా డుప్లెసిస్ నిలిచాడు. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ఫీల్డ్ చివరి ఓవర్లో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లనే అనుమతించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్లో ఓవర్ రేట్ ఉండటంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల జరిమానా విధించాడు.

Next Story