ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2024 విజేతగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2024 ఎడిషన్‌ శనివారం ముగిసింది.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 7:55 AM IST
international t20 league-2024, winner, mumbai indians emirates,

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2024 విజేతగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2024 ఎడిషన్‌ శనివారం ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్ టీమ్‌ తలపడింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఎమిరేట్స్‌ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (57 నాటౌట్), ఆండ్రీ ఫ్లెబర్ (53) చెలరేగి ఆడటంతో భారీ స్కోరును సాధించింది. ఇక ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ వసీం (43), కుశాల్ పెరీరా (38) కూడా రాణించారు. మరోవైపు క్యాపిటల్స్‌ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్‌ఖాన్‌ ఖాతాలో తలో వికెట్ ఉన్నాయి.

209 పరుగుల భారీ లక్ష్యంతో దుబాయ్‌ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. ట్రెంట్‌ బౌల్ట్ (4-0-20-2), విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్‌ తలో వికెట్ తీశారు. దుబాయ్ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సామ్‌ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) మోస్తరు స్కోర్లను సాధించారు. సికందర్ రజా (10), రోవ్‌మన్‌ పావెల్ (8) పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యారు.

ఇక ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2024 ఎడిషన్ విజేతంగా ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు వేగంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ పూరన్‌కు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. టోర్న ఆధ్యాంతం రాణించిన సికందర్‌ రజాకు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. కాగా.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం.


Next Story