కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఏమని ట్వీట్ చేశారంటే

Indian cricketer Krunal Pandya's Twitter account hacked.హార్దిక్ పాండ్యా సోదరుడు క్రికెటర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా

By M.S.R  Published on  27 Jan 2022 6:04 AM GMT
కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఏమని ట్వీట్ చేశారంటే

హార్దిక్ పాండ్యా సోదరుడు క్రికెటర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారు. అతని ఖాతాలో బిట్‌కాయిన్ స్కామర్ ట్వీట్ కనిపిస్తోంది. హ్యాకర్లు కృనాల్ ఖాతా నుంచి చాలా ట్వీట్లు చేశారు."బిట్‌కాయిన్‌ల కోసం ఈ ఖాతాను విక్రయిస్తున్నా'' అని ట్వీట్‌ చేశారు. అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత ఉదయం 7.30 గంటల ప్రాంతంలో తొలి ట్వీట్ చేశారు. బిట్‌కాయిన్ స్కామర్లు ఇప్పటికే పలువురి ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో కృనాల్ పాండ్యా కూడా చేరిపోయాడు. ఇలాంటి మోసాల కోసం ఇప్పటికే వందల్లో హై ప్రొఫైల్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడ్డాయి.

2020లో ఇటువంటి స్కామ్‌ల కోసం వందల్లో హై-ప్రొఫైల్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడ్డాయి. భారత్ లోని పలువురు ప్రముఖుల అకౌంట్లను హ్యాక్ చేసిన కేటు గాళ్ళు.. బిట్ కాయిన్ ను కొనుక్కోవాలంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని పలువురు నిపుణులు తెలిపారు.

ఇక భారత్ తరఫున కృనాల్ ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంవత్సరం బరోడా జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. వచ్చే నెలలో ఐపీఎల్‌కు మెగా వేలం జరగనుంది. ఇందులో కృనాల్ పాండ్యాకు మంచి ధర లభించవచ్చు. ముంబై ఇండియన్స్ జట్టు తిరిగి కృనాల్ పాండ్యాను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉండగా.. పలు జట్లు కూడా అతడిని వేలంలో సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాయి.


Next Story
Share it