అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సరీస్ సమం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 7:32 PM ISTఅరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సరీస్ సమం అయ్యింది. ఒక మ్యాచ్ రద్దు అవ్వగా.. చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి భారత్, సౌతాఫ్రికా టీమ్‌లు. ఇక మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇందులో చివరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 21 పరుగుల చేసిన కేఎల్ రాహుల్ ఓ ఘనత అందుకున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. 14 ఏళ్ల క్రితం ఈ ఘనతను టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ చేశాడు.
మూడో వన్డేలో భాగంగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్ (10)తో పాటు కేఎల్ రాహుల్ 21 పరుగులకు ఔట్ అయ్యారు. చాలా సేపటి వరకు క్రీజులో కొనసాగిన తిలక్ వర్మ 52 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, హెండ్రిక్స్, ముల్డర్‌లకు తలో వికెట్ దక్కింది. మూడు వన్డేల్లో తొలి వన్డే మ్యాచ్ భారత్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా విన్ అయ్యింది. మూడో వన్డేలో గెలిచిన టీమ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఇక వన్డే సిరీస్ తర్వాత రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. డిసెంబర్ 26న తొలి టెస్టు, వచ్చే ఏడాది జనవరి 3న రెండో టెస్టు ప్రారంభం అవుతంది. ఇక ఈ మ్యాచులకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రానున్నారు.