IND Vs ENG: ధర్మశాలలో హెలికాప్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ (వీడియో)

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ చివరి టెస్టు మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 5:30 PM IST
india vs england, test series, dharamshala, rohit, helicopter,

IND Vs ENG: ధర్మశాలలో హెలికాప్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ (వీడియో)

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ చివరి టెస్టు మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. అయితే.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో ఇప్పటికే ఇండియా కైవసం చేసుకోగా నామమాత్రంగానే ఈ ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌ కోసం ఇప్పటికే టీమ్‌ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాస్త ఆలస్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరాడు. తాజగా రోహిత్‌ శర్మ ధర్మశాలలో హెలికాప్టర్‌తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హిట్‌మ్యాన్‌ హెలికాప్టర్‌లో ధర్మశాల గ్రౌండ్‌లో దిగుతుండగా కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం అదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంగ్లాండ్, ఇండియా మధ్య చివరి టెస్టు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం రెండు జట్ల సభ్యులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. రోహిత్‌ ఒక్కడే కాస్త ఆలస్యంగా వచ్చాడు. అయితే.. అతడిని హెలికాప్టర్‌లో ధర్మశాలకు తీసుకొచ్చారు. రాంచీ టెస్టు తర్వాత రోహిత్ విరామం తీసుకున్నాడు. గుజరాత్‌ జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు వెళ్లాడు. సతీణి రితికాతో పటు ఈవెంట్‌లో కనిపించాడు. ఇక ఆ ఈవెంట్‌ తర్వాత కెప్టెన్ రోహిత్‌ ధర్మశాలకు వెళ్లి టీమ్‌తో కలిశాడు.

చివరి టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక చివరి టెస్టులో గెలిచి ..కనీసం రెండు విజయాలతో అయినా టెస్టు సిరీస్‌ను ముగించాలని ఇంగ్లండ్ అనుకుంటోంది.


Next Story