IND Vs ENG: రోహిత్, గిల్‌ సూపర్‌ సెంచరీలు

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌పై రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించి ఇండియా భారీ స్కోరు దిశగా వెళ్తుంది.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 11:41 AM IST
india vs england, test match, dharamshala,

IND Vs ENG: రోహిత్, గిల్‌ సూపర్‌ సెంచరీలు  

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌పై రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించి ఇండియా భారీ స్కోరు దిశగా వెళ్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్‌, స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరూ సెంచరీలను సాధించారు. రోహిత్‌ 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ కొట్టగా.. కాసేపటికే గిల్‌ 141 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు. దాంతో.. ఇండియా ప్రస్తుతం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 264 పరుగులు చేసింది. 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో టెస్టులో తొలి రోజే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయ్యింది. ఇక మధ్యాహ్నం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా అదరగొట్టింది. యశస్వి జైస్వాల్‌ ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్‌కు చేరాడు. ఇక ప్రస్తుతం సెంచరీ చేసి నిలకడగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ధర్మశాల వేదికగా చివరి ఐదో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. చివరి మ్యాచ్‌ను అయినా విజయంతో ముగించి ఇంటికి వెళ్లాలనుకున్న ఇంగ్లండ్‌ టీమ్‌కు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ధర్మశాలలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 218 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. మొదటి రోజే బ్యాటర్లు చేతులెత్తేయడంతో కుప్పకూలిపోయింది. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, అశ్విన్‌, జడేజాలు తమ మాయ మరోసారి చూపించారు. కుల్దీప్‌ ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Next Story