IND Vs ENG: ఇంగ్లండ్‌పై రికార్డు క్రియేట్ చేసిన అశ్విన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 1:23 PM ISTIND Vs ENG: ఇంగ్లండ్‌పై రికార్డు క్రియేట్ చేసిన అశ్విన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అశ్విన్ అవతరించాడు. రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు అశ్విన్.
కాగా.. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌పై 96 వికెట్లు పడగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. అంతకుముందు ఇంగ్లండ్‌పై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఉన్నాడు. 1964-79 కాలంలో అతడు ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. అయితే.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేశాడు అశ్విన్. 45 ఏళ్ల చంద్రశేఖర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి తన పేరుని రికార్డులెకెక్కించాడు.
ఇక ఇంగ్లండ్‌పై భారత్ తరుఫున ఎక్కువ వికెట్లు తీసినవారిన జాబితాల్లో వరుసగా చంద్రశేఖర్ (95), అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ (85), కపిల్ దేవ్ (85), ఇషాంత్ శర్మ (67) ఉన్నారు.