IND Vs ENG: రెండో రోజు భారత్‌కు 255 పరుగుల ఆధిక్యం
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 8 March 2024 5:13 PM ISTIND Vs ENG: రెండో రోజు భారత్‌కు 255 పరుగుల ఆధిక్యం
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ రెండు రోజు భారత బ్యాటర్లు రాణించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో రాణించారు. దాంతో.. స్కోరు బోర్డు పరుగులు తీసింది. భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. తద్వారా 255 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. 218 పరుగులు మాత్రమే చేసి పది వికెట్లు కోల్పోయారు.
అయితే.. తొలి రోజే మధ్యాహ్నం టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి రోజు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే.. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ తర్వాత పెద్ద షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్... రోహిత్ శర్మతో కలిసి సూపర్ ఇన్నింగ్స్‌ను ఆడారు. ఇద్దరూ చెరో సెంచరీని బాదేశారు. 162 బంతుల్లో రోహిత్ 103 పరుగులు చేయగా.. 150 బంతుల్లో శుభ్‌మన్ గిల్ 110 పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ చెరో హాఫ్ సెంచరీలు చేశారు. పడిక్కల్ 103 బంతుల్లో 65 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 60 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో టీమిండియాకు ఆధిక్యం భారీగా పెరిగింది. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ (27*), బుమ్రా (19*) ఉన్నారు.
ఇక ఇంగ్లండ్ బౌలింగ్ చూస్తే.. షోయబ్ బషీర్ ఒక్కడే నాలుగు వికెట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత హార్ట్‌లీ రెండు వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లంగ్ తొలి ఇన్నింగ్స్‌లో తొందరగా ఆలౌట్ అయ్యింది. దాంతో.. ఇండియాకు ఆధిక్యం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను ఇండియా 3-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టును గెలుపుతో అయినా ముగించాలని ఇంగ్లండ్ భావించినా వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. భారత్ మంచి ఆధిక్యం సాధించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడినట్లు అయ్యింది.