IND Vs BAN: వదలని వరుణుడు.. రెండోరోజు ఆట వర్షార్పణం

భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  28 Sep 2024 9:20 AM GMT
IND Vs BAN: వదలని వరుణుడు.. రెండోరోజు ఆట వర్షార్పణం

భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే చెన్నై వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ముగిసింది. అందులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు కాన్పూర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఏర్పడుతోంది. మొదటి రోజు ఆట ప్రారంభం అయిన కాసేపటికే వర్షం పడటంతో మ్యాచ్‌ శుక్రవారం రద్దు అయ్యింది. ఇక శనివారం అయినా మ్యాచ్‌ సాగుతుంది భావిస్తే.. మళ్లీ వరుణుడు వదల్లేదు. చివరకు రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది.

గ్రీన్ పార్క్ స్టేడియం చిత్తడిగా మారింది. దాంతో, ఇవాళ ఆటను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. కాగా.. రెండో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రోజు కూడా వర్షం కారణంగా సగానికిపైగా ఓవర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. బంగ్లా 107/3 పరుగులు చేసింది. క్రీజులో మొమినల్ హక్ (40*), ముష్ఫికర్ రహీమ్ (6*) ఉన్నారు. తొలిరోజు భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లు విజయం సాధించలేదు. కానీ ఆకాశ్ దీప్ రెండు వికెట్లను పడగొట్టగా, ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాలని భారత బౌలర్లు భావిస్తున్నారు.

Next Story