బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడబోయే టీమిండియా ఇదే..

టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 3:15 PM IST
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడబోయే టీమిండియా ఇదే..

టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. మూడున్నర రోజుల్లోనే తొలి టెస్టును భారత్ ముగించింది. రోహిత్‌ సేన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఏకంగా 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ టెస్టులో ఆతిథ్య జట్టు అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. తద్వారా బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లను పడగొట్టి ఈ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. అంతేకాదు, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది భారత్.

ఇక, భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబరు 27 నుంచి కాన్పూర్ లో జరగనున్న విషయంతెలిసిందే. ఈ టెస్టు కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టును రెండో టెస్టు కోసం కూడా ఎంపిక చేసింది.

రెండో టెస్టు టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.

Next Story