క్రికెట్ అభిమానులకు పండగే.. ఫైనల్‌లో భారత్ Vs పాక్
భారత్ జట్టు దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడితే వచ్చే కిక్కే వేరు.
By Srikanth Gundamalla Published on 13 July 2024 11:00 AM ISTక్రికెట్ అభిమానులకు పండగే.. ఫైనల్‌లో భారత్ Vs పాక్
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ జట్టు దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడితే వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పాక్, భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయాని ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు దేశాలు తలబడపోతున్నాయి.
శనివారం నార్తాంప్టన్ వేదికంగా టైటిల్ పోరు జరుగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోబుతున్నాయి. శుక్రవారం జరిగి రెండో సెమీఫైనల్‌లో 86 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్ ఫైనల్ చేరుకుంది. ఇక తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన పాకిస్థాన్ తుది పోరుకు సిద్ధం అయ్యింది.
కాగా.. ఫైనల్‌లో గెలిచి లీగ్ స్టేజ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని.. అలాగే కప్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూపు స్టేజ్‌లో పాక్ చేతిలో భారత్ 68 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. అయితే.. పాకిస్థాన్‌ను ఓడించడం అంత ఈజీ కాదనీ.. లెజెండ్స్ టీమ్ అద్భుతమైన ఫామ్‌లో ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా అజేయంగా ఉంది. అయితే.. ఆసీస్‌పై ఆడినట్లుగా భారత జట్టు ఆడితే మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారత బ్యాటర్లలో ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ దాయాది పోరు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.