మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ను ఊరిస్తోన్న వరల్డ్ రికార్డు
ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది టీమిండియా.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 7:28 AM GMTమూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ను ఊరిస్తోన్న వరల్డ్ రికార్డు
ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఆ రెండింటిలోనూ యువ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. 2-0తో ఆసీస్‌పై పై చేయి కొనసాగిస్తున్నారు. అయితే.. మూడో టీ20లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు మూడో టీ20లో తప్పక గెలిచి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా. టీమిండియాలో ఇటు బ్యాటర్స్.. అటు బౌలర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. గత మ్యాచుల్లో ఆటను చూసి టీమిండియా ఆటగాళ్లకు ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచుల్లో 200 ప్లస్ రన్స్ చేసిన టీమిండియా అదే మజాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధం అవుతోంది. వరుస ఓటముల నుంచి కోలుకుని.. సిరీస్ కప్‌ను సొంతం చేసుకునేందుకు అవకాశాలను నిలుపుకోవాలని చూస్తోంది.
అయితే.. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనక టీమిండియా విజయం సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలను అందుకున్న జట్టుగా భారత్ చరిత్రకెక్కనుంది. ఇప్పటికే టీ20ల్లో 135 సాధించింది భారత్. ఇప్పుడు తాజాగా 136వ విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే.. పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును సూర్యకుమార్ సేన అధిగమించనుంది. అయితే.. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా 135 విజయాలతో భారత్‌తో సమానంగా ఉంది. ఇప్పటి వరకు 211 మ్యాచ్‌లు ఆడిన ఇండియా 135 విజయాలను అందుకుంది. కేవలం 66 మ్యాచుల్లో ఓటమని చవిచూసింది. ఇందులో ఆరు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అయితే.. పాకిస్థాన్ ఆత్రం 266 మ్యాచులు ఆడి 135 టీ20 మ్యాచుల్లో విజయం సాధించింది. 82 మ్యాచుల్లో ఓటమిని చూసింది. భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ జాబితాలో న్యూజిలాండ్(200 మ్యాచ్‌ల్లో 102 విజయాలు), సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ల్లో 95), ఆస్ట్రేలియా( 179 మ్యాచ్‌ల్లో 94), ఇంగ్లండ్( 177 మ్యాచ్‌ల్లో 92) కొనసాగుతున్నాయి.