హార్దిక్‌ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా..?

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 5:30 PM IST
hardik pandya, natasa,  social media,

హార్దిక్‌ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా..?

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వచ్చిన తర్వాత హార్దిక్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వరుసగా మ్యాచ్‌ల్లో ఓడిపోవడం.. పాయింట్స్‌ టేబుల్‌లో వెనుకబడటం ఇలా ఇంకా కొన్ని విషయాల్లో నెటిజన్లను కొద్ద రోజులుగా ట్రోల్ చేస్తూనే వచ్చారు. ఇక తాజాగా హార్దిక్ పాండ్యాకు సంబంధించిన మరో వార్త ట్రెండింగ్‌ అవుతోంది. తన భార్య నటాషాతో హార్దిక్‌కు విభేదాలు వచ్చాయనీ.. వారు విడిపోతున్నారని జోరుగా చర్చ సాగుతోంది.

2018లో హార్దిక్ పాండ్యా, నటాషాకు పరిచయం ఏర్పడింది. దాదాపు ఈ పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పాండ్యా పుట్టిన రోజు సందర్భంగా 2018లో ఇచ్చిన వేడుకను చూసిన తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్టన్లు వార్తలు వచ్చాయి. ఓ ఏడాది తర్వాత హార్దిన్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్‌ మీడియాలో నటాషా చెప్పింది. హార్దిక్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టింది. ఇక 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నానని హార్దిక్ ప్రకటించాడు. సముద్ర జలాల మధ్య నటాషాకు ప్రపోజ్ చేసిన వీడియోను కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత కొంత కాలం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఏడాది లాక్‌డౌన్‌లో తల్లిదండ్రులు అయినట్లు చెప్పారు నటాషా-హార్దిక్. వివాహం మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 13న హార్దిక్, నటాషా వివాహం చేసుకున్నారు.

ఇక తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో హార్దిక్‌ పేరు తొలగించింది. దాంతో.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా కొద్దికాలంగా తక్కువ పోస్టులు పెడుతోంది. దాంతో.. ఆమె బాధలో ఉన్నారనీ.. విడిపోతున్నారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇవే వార్తలపై నటాషా పరోక్షంగా స్పందించారు. హార్దిక్‌తో విడిపోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. హార్దిక్‌తో తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇక హార్దిక్‌ మాత్రం ఇప్పటి వరకు ఈ వార్తలపై స్పందించలేదు.

Next Story