టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans Won Toss opt to bowl. గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ లో ఆసక్తిపోరు జరగనుంది.

By M.S.R  Published on  12 May 2023 7:27 PM IST
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ లో ఆసక్తిపోరు జరగనుంది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు గత మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌ తో రంగంలోకి దిగాయి. ప్లేఆఫ్‌ల రేసు ముమ్మరం కావడంతో, ప్రస్తుతం టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిచి మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను అధిగమించగలదు. ఈ సీజన్ లో ఇప్పటికే తలపడగా.. ఆ మ్యాచ్ లో గుజరాత్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ

గుజరాత్ టైటాన్స్ సబ్స్: గిల్, సుదర్శన్, KS భరత్, శివం మావి, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్

ముంబై ఇండియన్స్ సబ్స్: మధ్వల్, రమణదీప్, బ్రేవిస్, వారియర్, షోకీన్


Next Story