IPL-2024: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 10:32 AM ISTIPL-2024: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఈ టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయినా.. ఏదో ఒక ఇయర్ కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అభిమానులు దీమాగా ఉంటారు. సీజన్ ప్రారంభమైతే చాలు ఎక్కువ శాతం ఈ టీమ్‌కు సపోర్ట్ చేసే వారే కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ టీమ్ ఫ్యాన్స్‌కు ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌న్యూస్ చెప్పాడు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్ ఆడతానని ఆర్సీబీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు.
ఐపీఎల్ అంటే తనకు ఎంతో ఇష్టమని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. ఇక నడవలేను అనుకునే వరకు ఈ టోర్నీలో కొనసాగుతానని వెల్లడించాడు. తన లైఫ్‌లో ఐపీఎలే తన చివరి క్రికెట్ టోర్నీ అవుతుందని చెప్పాడు. అయితే.. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. విరాట్, డివిలియర్స్, డప్లెసిస్ వంటి ఆటగాళ్లతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయని మాక్స్‌వెల్ భావోద్వేగం వ్యక్తం చేశాడు. అయితే.. దీర్ఘకాలం పాటు మ్యాక్స్‌వెల్ ఆర్సీబీలో కొనసాగుతానని చెప్పకనే చెప్పడంతో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో.. ఆర్సీబీ తరఫున 2024 సీజన్‌లో గొప్పగా ఆడి ఈ సారి టీమ్ కప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. మ్యాక్సీ ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ దకూరం చేసుకోదనే గట్టి నమ్మకంతో కూడా ఉన్నారు అభిమానులు. అంతేకాక మ్యాక్స్‌వెల్‌తో కోహ్లీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. దాంతో.. అతడు ఉన్నంత వరకు ఆర్సీబీలోనే కొనసాగుతాడని ఆ టీమ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుంటూ మ్యాక్స్‌వెల్ కామెంట్స్‌తో ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2021 సీజన్ నుంచి ఆర్సీబీలో ఆడుతున్నాడు మ్యాక్స్‌వెల్. అంతకు ముందు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలతో కలిసి ఆడాడు. మ్యాక్స్‌వెల్‌కు ఆర్సీబీ 14.25 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తోంది.