అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై
స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 11:23 AM ISTస్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం 37ఏళ్ల వయసు ఉన్న మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున ఆల్‌రౌండర్ క్రికెటర్‌గా ఉన్నాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున తొలి క్రికెట్ మ్యాచ్‌ను ఆడాడు. కాగా.. మెయిన్ మొత్తం 68 టెస్టు మ్యాచ్‌లు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొయిన్ అలీ ఇంగ్లండ్ తరఫున 6,600కి పైగా పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో కూడా సత్తా చాటాడు. 360కి పైగా వికెట్లతో రాణించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 1,162 పరుగులు చేశాడు. 35 వికెట్లను పడగొట్టాడు.
ఇంగ్లండ్ తరఫున క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మొయిన్ అలీ స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడో వివరణ ఇచ్చాడు. తనకు 37 ఏళ్ల వయసు అనీ చెప్పుకొన్నాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు ఎంపిక కాలేదన్నాడు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడాను అనీ.. ఇక కొత్తతరం జట్టులోకి రావాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే తాను కొత్తవారికి అవకాశం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొయిన్ అలీ ప్రకటించాడు. తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నా.. బాధగా ఏమీ లేదన్నాడు. ఇప్పటికీ క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందనీ.. జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకునే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నానని మొయిన్ అలీ తెలిపాడు.