మైదానంలో బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్ డ్యాన్స్.. వీడియో వైరల్
David Warner dances for Butta Bomma song.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి బుట్టబొమ్మ సాంగ్ కు
By సుభాష్ Published on 28 Nov 2020 6:19 AM GMTఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్పులు వేశాడు. అయితే.. ఈ సారి వేసింది ఇంట్లో కాదు.. ఏకంగా మైదానంలోనే. అవును సిడ్ని వేదికగా జరిగిన తొలి వన్డేల్లో టీమ్ఇండియా చేజింగ్ చేస్తుండగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశాడు. 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన ఈ మ్యాచ్‌లో కొందరూ వార్నర్ చిందెయ్యడాన్ని తమ ఫోన్లతో వీడియో తీసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లుఅర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని ఈ పాట ఇప్పటికే విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వార్నర్ కుటుంబంతో సహా బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి టిక్‌టాక్ వీడియో చేయగా.. అది వైరల్ అయింది. ఈ సాంగ్ హీరో అల్లు అర్జున్ కూడా ట్విటర్ వేదికగా వార్నర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతలా ఆకట్టుకున్నాడు వార్నర్.
ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 66 పరుగులతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (105 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (69 76 బంతుల్లో 6ఫోర్లు ), గ్లెన్ మాక్స్‌వెల్ (45 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా(90 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74 86 బంతుల్లో 10 ఫోర్లు) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలమవ్వడంతో.. సుదీర్ఘ పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
Buttabomma and Warner Never Ending Love Story 😂😂♥️.#AUSvIND @davidwarner31 pic.twitter.com/TjEeMKzgt3
— M A N I (@Mani_Kumar15) November 27, 2020