సూరత్‌లో భారీ సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టిన ధోని

CSK captain MS Dhoni warms up with massive sixes at Surat. భారతజట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన

By M.S.R  Published on  9 March 2022 12:25 PM IST
సూరత్‌లో భారీ సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టిన ధోని

భారతజట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. గత రెండు ఐపీఎల్ టోర్నీలలో ధోని పెద్దగా రాణించకపోవడం, 40 సంవత్సరాల వయస్సులో ఉండడంతో ధోనికి ఇదే తన చివరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ కూడా అవ్వచ్చు. ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు సూరత్‌లో కొనసాగుతున్న సీఎస్‌కే ప్రాక్టీస్ ను చూస్తే ధోనికి ఇంకా వయసవ్వలేదు అనే అంటారు. ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ లో అద్భుతంగా ఆడుతున్నాడు.

ఐపీఎల్‌ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. సూరత్‌లోని నెట్స్‌లో ధోని కొన్ని భారీ షాట్లు కొట్టడం కనిపించింది. సోషల్‌ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలో, మహేంద్ర సింగ్ ధోని 3 భారీ షాట్‌లను కొట్టడం కనిపించింది, మూడవది వన్ హ్యాండ్ షాట్.. అది చాలా దూరం ప్రయాణించింది. ఐపీఎల్‌ 2022 ప్రారంభానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నందున.. సీఎస్‌కే ఆటగాళ్ళు తమ సీజన్ ప్రారంభానికి ముందే ప్రాక్టీస్ ప్రారంభించారు. సూరత్‌లోని నెట్స్‌లో ఎంఎస్ ధోని భారీ సిక్సర్లు కొట్టిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.

సూరత్‌లో సీఎస్‌కే ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో సీఎస్‌కే ఆటగాళ్లను తీసుకొచ్చిన బస్సు పక్కన అభిమానులు నిలబడి కనిపించారు. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది.

Next Story