దీపక్‌ చాహర్‌ అన్ని ఇబ్బందులు పడ్డాడా..?

Cricketer Deepak Chahar DISAPPOINTED with Malaysia Airlines. వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ కు టీమిండియా చేరుకుంది.

By M.S.R  Published on  3 Dec 2022 4:09 PM IST
దీపక్‌ చాహర్‌ అన్ని ఇబ్బందులు పడ్డాడా..?

వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ కు టీమిండియా చేరుకుంది. అయితే పేసర్‌ దీపక్‌ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న దీపక్‌ చాహర్‌, శిఖర్‌ ధావన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నేరుగా వెల్లింగ్‌టన్‌ నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు. మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్‌ ఢాకాకు రాలేదు. దీంతో చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"మలేషియా ఎయిర్‌లైన్స్‌లో ఘోరమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా ఇవ్వలేదు. మాతో పాటు లగేజ్‌ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్‌ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజ్‌ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్‌ ట్విటర్‌లో చెప్పుకొచ్చాడు. మలేషియా ఎయిర్‌లైన్స్ చాహర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.


Next Story