ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని నేతృత్వంలో తమ టైటిల్ ను కాపాడుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. IPL 2022 మార్చి 26న ముంబైలో ప్రారంభమవుతుంది, CSK గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. భారత మాజీ పేసర్, CSK అసిస్టెంట్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సహాయక సిబ్బందితో పాటు శిక్షణా శిబిరం కోసం ధోని బుధవారం (మార్చి 2) సూరత్‌లో అడుగుపెట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ సూరత్‌లో ప్రీ-సీజన్ క్యాంపును ప్రారంభించాలని నిర్ణయించుకుందని తెలిపారు. మార్చి 8 నాటికి శిబిరం ప్రారంభమవుతుందని ఆయన ధృవీకరించారు. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దులో సూరత్ ఉండగా.. మొత్తం IPL సీజన్ ముంబై, పూణేలలో జరుగుతుంది. పరిస్థితులను అంచనా వేయడానికి తాము ముంబై, పూణెలో ఉన్న వికెట్లపై ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ప్రయాణం చాలా సులభం అవుతుందని విశ్వనాథన్ ESPNcricinfoతో అన్నారు.
ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని విదేశీ కోచింగ్ సిబ్బంది మార్చి 12న చేరుకుంటారు. IPL 2022 సీజన్ మార్చి 26-మే 29 వరకు జరుగుతుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ముంబై, పూణేలోని నాలుగు అంతర్జాతీయ ప్రమాణాల వేదికలలో నిర్వహించనున్నారు. దీపక్ చాహర్ - IPL 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క అత్యంత ఖరీదైన కొనుగోలుదారుడుగా నిలిచాడు. గాయం కారణంగా IPL 2022 సీజన్‌లో అతడి సేవలను చెన్నై కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి T20Iలో చాహర్ గాయపడ్డాడు. గాయం నుండి కోలుకోవడం కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో దీపక్ చాహర్ ఉన్నాడు.