టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ధోని ఎవరెవరిని పక్కన పెట్టాడంటే..?

Chennai Super Kings opt to bowl. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.

By M.S.R  Published on  8 April 2023 7:19 PM IST
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ధోని ఎవరెవరిని పక్కన పెట్టాడంటే..?
ఐపీఎల్ 16వ సీజ‌న్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఈ సీజన్ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతున్నాయి. వాంఘ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టాల‌ని ముంబై టీమ్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌హేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి.. ముంబై ఇండియ‌న్స్‌కు బ్యాటింగ్ అప్ప‌గించాడు. ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ ఆడడం లేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. చెన్నై టీమ్ కు స్టోక్స్, మొయిన్ అలీ దూరమయ్యారు. లోకల్ బాయ్ అజింక్య రహానే ఆడనున్నాడు. ప్రిటోరియస్ ను తీసుకున్నట్లు తెలిపాడు ధోని.


చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగాలా, తుషార్ దేశ్‌పాండే

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్


Next Story