టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఇంట్లో దొంగతనం

టీమిండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 12:21 PM IST
cell phone, theft,  sourav ganguly, house,

టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఇంట్లో దొంగతనం

టీమిండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని బెహలాలో ఉన్న గంగూలోకి ఇంట్లోకి చోరబడి చోరీకి పాల్పడ్డారు. గంగూలీ ఇంట్లో రూ.1.6 లక్షల విలువైన ఫోన్‌ను అపహరించారు. ఇక తన ఇంట్లో ఫోన్‌ చోరీకి గురైందన్న విషయం తెలుసుకున్న గంగూలీ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. థాకురపుకుర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చారు. చోరీకి గురైన ఫోన్‌లో తన వ్యక్తిగత సమాచారం ఉందనీ.. దాన్ని దుర్వినియోగం చేయకుండా వెంటనే సుదురు వ్యక్తులను పట్టుకుని తన ఫోన్‌ను తిరిగి ఇచ్చేలా చూడాలని కోరాడు సౌరభ్ గంగూలీ.

సౌరభ్‌ గంగూలీ తన ఫోన్‌ను ఇంట్లో దాచి బయటకు వెళ్లాడు. తాను తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ ఫోన్ కనిపించలేదట. తన ఫోన్‌ అపహరణకు గురైందన్న విషయాన్ని గ్రహించిన గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. పలువురి కాంటాక్ట్‌లతో పాటు ముఖ్యమైన డేటా ఉందనీ గంగూలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మధ్యే గంగూలీ తన ఇంటికి పెయింటింగ్ వేయించారు. అందులో ఒకరే తన ఫోన్‌న అపహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వారిని కూడా పిలిపించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

టీమిండియా క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా గంగూలీకి పేరుంది. అతను క్రికెట్‌ను రిటైర్ అయిన తర్వాత బీసీసీఐలో కూడా పనిచేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా కొనసాగుతున్నారు.

Next Story