కెనడా సింగర్ ను అన్ ఫాలో చేసిన కోహ్లీ
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ సింగర్ అయిన కెనడియన్ సింగర్ ను అన్ ఫాలో చేశాడు.
By M.S.R Published on 20 Sept 2023 4:44 PM ISTభారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ సింగర్ అయిన కెనడియన్ సింగర్ ను అన్ ఫాలో చేశాడు. సోషల్ మీడియాలో భారత మ్యాప్‌ను వక్రీకరించిన చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు కెనడియన్ గాయకుడు శుభ్‌ను విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు. తన పోస్ట్ లో పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించారు. దీంతో దేశవ్యాప్తంగా శుభ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
శుభ్ సంగీతం అంటే విరాట్ కోహ్లికి ఇష్టం. గతంలో అతడిపై ఓ ట్వీట్ వేసి విరాట్ కోహ్లీ తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే శుభ్ భారత వ్యతిరేక శక్తులకు తోడ్పాటును అందిస్తూ ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అందుకే విరాట్ కోహ్లీ ర్యాపర్ శుభ్ ను అన్ ఫాలో చేశాడు. 2023 IPL సమయంలో కోహ్లీ-అనుష్క శర్మలు శుభ్ ఎలివేటెడ్ పాటకు జిమ్ లో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ అప్పట్లో వైరల్ గా మారింది. శుభ్ పాటలకు ఒకప్పుడు డ్యాన్స్ లు వేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు అతడిని దూరం పెట్టాడు. త్వరలో శుభ్ భారత్ లోని పలు ప్రాంతాల్లో మ్యూజికల్ టూర్లకు రావాల్సి ఉండగా ఇప్పుడు అతడు వచ్చేది అనుమానమేనని అనిపిస్తోంది. భారతీయ జనతా యువ మోర్చాకి చెందిన పలువురు సభ్యులు శుభ్ వేర్పాటువాద ఖలిస్తానీలకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు. అతడిని భారత్ లో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.