సినిమా రేంజ్‌ ఎంట్రీ.. హెలికాప్టర్‌తో గ్రౌండ్‌లో ల్యాండైన వార్నర్

బిగ్‌బాష్‌ లీగ్‌ లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సినిమా రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 2:33 PM IST
big bash league, warner,  helicopter,

సినిమా రేంజ్‌లో ఎంట్రీ.. హెలికాప్టర్‌తో గ్రౌండ్‌లో ల్యాండైన వార్నర్

బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది. అయితే.. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సినిమా రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రయివేట్‌ హెలికాప్టర్‌లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ల్యాండ్‌ అయ్యాడు. అయితే.. సోదరుడి వివాహ వేడుకకు వెళ్లిన వార్నర్‌.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వచ్చాడు. దాంతో.. ఆలస్యం కాకుండా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

అయితే.. ఇలా హెలికాప్టర్‌లో నేరుగా గ్రౌండ్‌లో ల్యాండ్‌ అయ్యేందుకు నిర్వాహకులు అనుమతించరు. కానీ.. ఎవరికీ లభించని అవకాశం డేవిడ్ వార్నర్‌కు దొరికింది. వార్నర్‌ కోసం బిగ్‌బాష్‌ లీగ్‌ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేఇంది. అంతర్జాతీయ టెస్ట్, వన్డే క్రికెట్‌కు వార్నర్‌ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వార్నర్‌ ఆడనున్న తొలి మ్యాచ్‌ ఇదే. దాంతో.. అతడి గౌరవార్ధం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సిడ్నీ థండర్స్‌ చీఫ్‌ వెల్లడించారు.

కాగా.. గత బీబీఎల్‌ సీజన్‌లో వార్నర్‌ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులోభాగంగానే జనవరి 12న సిడ్నీ సిక్సర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో వార్నర్ ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రస్తుతం వార్నర్‌ టీ20 ఫార్మాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ఉండబోతుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నట్లు తెలిపాడు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక త్వరలోనే విండీస్‌తో ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ ఆడబోతుంది. ఇందులో కూడా తాను ఉంటానని వార్నర్ చెప్పాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటి వరకు వార్నర్‌ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. సెంచరీతో సహా 201 పరుగులు చేశాడు.

Next Story